Jersey Telugu movie Review : Distance between Talent and Success

Jersey movie poster
Jersey movie review.

 

jersey telugu movie review :అందరు అన్నట్టు Jersey ఒక ఫెయిల్ అయిన వ్యక్తి కథ కాదు.ప్రతిభకు, విజయానికి మధ్య దూరం. Jersey   లో ఆ దూరం అనేక రకాలుగా కనిపిస్తుంది. ఒక కొడుకు కోరిక, ఒక భార్య బాధ్యత , కోచ్ నమ్మకం , పేదరికం ఇలా అనేక రకాలుగా కనిపిస్తుంది . అన్నింటికంటే  ముఖ్యంగా తనని తానె కోల్పోయే అర్జున్. జెర్సీ ని ఒక స్పోర్ట్స్ సినిమాగా చూడటం కంటే అజ్ఞాతంలో ఉన్న అర్జునుడిగా చూడటం సరైంది అని నా అభిప్రాయం.

సినిమాలో అర్జున్ కి క్రికెట్ పైన ఉన్న ఇష్టం ఎక్కడా కనిపించదు మనకి. కాసేపట్లో బాటింగ్ చేయాల్సిన సమయంలో కూడా ఆ డెడికేషన్ కనిపించదు.బహుశా క్రికెట్ కంటేకూడాఎక్కువ తాను సారానే ఇష్టపడ్డాడేమో. చాలా దూకుడుగా అనిపించే 26 ఏళ్ల అర్జున్ , పెళ్ళి లాంటి లైఫ్ ఈవెంట్స్ నికూడా సెకండ్స్ లో తీసుకునే వ్యక్తి తరువాత పూర్తిగా మారిపోవటం సారా వల్లనేనేమో అనిపిస్తుంది. తన గురించి వేరేవాళ్ళతో గొడవపడాలి, తనను పోషించాలి, 50000 లంచం ఇచ్చి లంచం తీస్కున్నాడేమో అన్నఅనుమానంతో పోయిన ఉద్యోగం తిరిగితెచ్చుకోటం లాంటి సగటు అమ్మాయిల ఆలోచనలు ఉన్న సారా కి అర్జున్ క్రికెట్‌తో పాటు ఏం కోల్పోయాడో అర్ధం చేసుకోటంకష్టమే. కొన్ని రోజుల్లో అప్పటికే రంజీల్లో టాప్ ఉన్నఅర్జున్ ని ఆపేయమనటం, ఫైనల్ మ్యాచ్ ముందు కూడా అర్జున్ హాస్పిటల్లోఉన్నప్పుడు తనో లేదా క్రికెట్టో తేల్చుకోమని అల్టిమేటం ఇవ్వటం ఇలా జెర్సీ లో అర్జున్ లోఉన్నసెల్ఫ్ డౌట్స్ కి సారా మెటాఫర్ గా కనిపిస్తుంది. సారా నిఒక క్యారెక్టర్‌గా కాకుండా అర్జున్ లో ఒక డైమెన్షన్ లా చుస్తే సారా తనలో ఉన్న రియలిస్టిక్ వరల్డ్ లోబతకగలిగే లక్షణాలు ఉన్న అర్జున్ లా కనిపిస్తుంది.మరోవైపు తనలోఉన్న చిన్నపిల్లోడులా , క్రికెట్ తప్ప వేరే ఏమి తెలియని కోణం అర్జున్ కొడుకు లో కనిపిస్తుంది. సరిగ్గా చుస్తే అర్జున్ కొడుకుకి, సారా కిమధ్య పెద్ద కామన్ సీన్స్ ఉండవ్ లైఫ్ ఆఫర్ చేసే చిన్నచిన్నపెర్క్స్ తప్ప( బర్త్‌డే గిఫ్ట్ ).

అర్జున్ తిరిగి క్రికెట్ లోకి వెళ్ళాలి అని అనుకోగానే తనలోతాను తీసుకునే మార్పులు మనకి తెలీకుండానే చాలా subtext రివీల్ చేస్తాయి.బహుశా ఇవే రీసన్స్ తో 26 అప్పుడు క్రికెట్ మానేయాల్సి వచ్చిందేమో అనిపిస్తుంది.కొచ్చేస్ కిఎదురుచెప్పడు.సెలెక్టర్లు మాట వింటూ బాటింగ్ పద్ధతి మార్హుకుంటాడు. ఇదంతా అర్ధం చేసుకోటానికి పది సంవత్సరాల కాలం పట్టింది అనిపిస్తుంది. ఇండియన్ టీం లోకి వెళ్లాలంటే ఆట ఒక్కటే సరిపోదు సెలెక్టర్స్ కి కావాల్సినవన్నీ ఉండాలి అని. ఫైనల్ మ్యాచ్ లోఎక్కవ సింగిల్స్ తీయటానికి కూడా ఇదే కారణం అవ్వొచ్చు. 36 అర్జున్‌లో మనకి కోపం  కనిపించదు.బాధ మాత్రమే కనిపిస్తుంది. మనిషికి చంపేసే బాధ కాదు బతకనిస్తూ చంపేసే బాధ. తనని తానూ కోల్పోయి గతం లోబతుకుతూ ఎక్కువ ఎమోషన్స్ చూపించకుండా తన ఆనందాన్ని కూడా రైలు శబ్దంలో కలిపేసుకునే అర్జున్ మనకి ఎడారి లాంటి ఒంటరితనంలో కనిపిస్తాడు.

అర్జున్ పాత్రలో నాని అద్భుతమే. సమకాలీన తెలుగు సినిమాలో నటన పరంగా అందరికి దూరంగా ఎక్కడికో వెళిపోయాడు ఈ Jersey తో.

 

గమనిక : ఇది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం  మాత్రమే

 

Find my other articles :

High Fidelity : Review – Love letter to broken hearts with a pop music!

Idlebrain : Jersey review

Facebooktwittergoogle_plus

Add a Comment

Your email address will not be published. Required fields are marked *